Back
 

President Message

ప్రియాతి ప్రియమైన తెలుగు మిత్రులకు,

పీడమాంట్ ఏరియా తెలుగు కుటుంబ సభ్యులకు పీడమాంట్ ఏరియా తెలుగు సంస్థ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు.  ఈ నూతన సంవత్సరం మీ అందరికీ ఆ భగవంతుడు సకల సుఖ సంతోషలతో పాటుగా, ఆయురారోగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా పాటా బోర్డు సభ్యుడిగా ఉంటూ పీడిమాంట్ ఏరియా తెలుగు చేపట్టిన ఎన్నో స్వచ్చంద సేవలలో పాల్గొని మీ అందరి సహాయ సహకారాలతో ఈ నూతన సంవత్సరానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడినందుకు మీ అందరికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నాతో ఎన్నుకోబడిన మిగతా కార్యవర్గ సభ్యులందరికి నా అభినందనలు తెలుపుతున్నాను. గత కొన్ని సంవత్సరములుగా తమకు తోచిన రీతిగా సహాయ సహకారాలు అందిస్తూ పీడమాంట్ ఏరియా తెలుగు  అసోసియేషన్ ఇంత మహావృక్షం లాగా వ్యాప్తి చెందటానికి కారణమైన సభ్యులకు, మాజీ కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలకు, స్పాన్సర్స్ కు అందరికీ నా నమస్సుమాంజలులు. ఈ నూతన సంవత్సరంలో నిర్వహించబోవు అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను మునుపటిలా, ఎప్పటిలా విజయ పథాన నడిపించాలని మరియు ఈ సారి మరింత వైవిధ్యంతో జరపాలన్న మా ప్రయత్నాన్ని మీరు గుర్తించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం లో జరుగబోవు ప్రతి కార్యక్రమానికి మీరు మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో తప్పక హాజరై జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన తియ్యని తెలుగు భాషని అంతా కంటే కమ్మని సాంప్రదాయాన్ని మరింత విస్తృత పరచాలనే తలంపుతో కృషి చేయటానికి నేను సిద్దముగా ఉన్నానని తెలుపుటకు గర్విస్తున్నాను. అదే విధముగా మీ అందరి సహాయ సహకారములతో మరియు నా  తోటి బోర్డు సభ్యులు మరియు మన పీడిమాంట్ ఏరియా తెలుగు మిత్రుల సహకారంతో ఈ సంవత్సరం అన్ని కార్యక్రమాలు ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలననీ నమ్ముతూ ...

మీ

వేణు మూగి